Tuesday, September 18, 2007

వనజ

మన తెలుగు సినిమాలకు కనీసం జాతీయ స్థాయిలోనైనా గుర్తింపు లేదు. అలాంటిది వనజ చిత్రానికి మంచి గుర్తింపే లభిస్తోంది. తెల్లోళ్లు మెచ్చుకుంటేనే గానీ మన సినిమాలు మనకు గొప్పగా కనపడవు. వాటర్ లాంటి మెట్ట సినిమాకూ అంతర్జాతీయ అవార్డులోచ్చాయనుకోండి. మంచి ఆంగ్ల చిత్రాల కోసం ఈమధ్య Roger Ebert రివ్యూలు చదవడం మొదలెట్టా. అందులో మన సినిమా వనజ గురించి రివ్యూ రాయడమే కాదు ఏకంగా 4 స్టార్లు ఇచ్చారు. సినిమా చాల అందంగా ఉందని కితాబులిచ్చారు. ఇన్నాళ్లూ ఈ సినిమాకు అవార్డులు వచ్చాయన్నా పెద్దగా పట్టించుకోలేదు గానీ ఇప్పుడు చూడాలనిపిస్తోంది.

Thursday, September 13, 2007

నోరుంది కదా అని

ఇష్టమొచ్చినట్లు వాగటం న్యూస్ ఛానెళ్లకు అలవాటైంది. ఆంగ్ల వార్తా పత్రికలు, ఛానెళ్లు ప్రభుత్వ నిర్ణయాల పైనా, రాజకీయాలు, ప్రజల పైనా ప్రభావం చూపుతున్నాయి. వార్తా రంగంలో ఉన్నవాళ్లు చాలా మంది కమ్యునిస్టులు, లౌకికవాదులు, ముస్లిములు, క్రైస్తవులు. యాజమన్యం, ఛీఫ్ ఎడిటర్లు వాళ్లే.
ఎక్కువ మందిని ఆకర్షించాలంటే సంచలనం చేయాలి, రచ్చ చెయాలి. CNNIBN వాళ్లది అదే ఆలోచన. తిరుమల-వీఐపీ వివాదం మీద చర్చకు హిందూ ధ్వేషిని తీసుకొచ్చారు.రామ సేతు వివాదం మీద చర్చకు ముస్లిం పాత్రికేయుడిని తీసుకొచ్చారు. కేంద్రం అఫిడవిట్ వెనక్కు తీసుకుంటే
Govt slips on Setu, BJP gets fillip అని NDTV వాళ్లు Headline పెట్టారు. MF మీద దాడి చేస్తే భావప్రకటనా స్వాతంత్ర్యం ఏదని గగ్గోలు పెట్టారు. అదే తస్లీమా మీద దాడి చేస్తే కళకు పరిమితి ఉండదా అని ప్రశ్నించారు. రామ అటే బూతు అనడం వీళ్లకు అలవాటై పోయింది. అసలు విషయం పక్కన పెట్టి మరీ అతి చేసే vhp, rss హంగామాని highlight చేస్తున్నారు. హిందూ మతంలో తప్పులే వీళ్లకి కనిపిస్తాయి. చాప కీంద నీరులా విస్తరిస్తున్న క్రైస్తవ మతమార్పిడుల గురించి పట్టించుకోరు. ముస్లిములు భయందోళనల మధ్య జీవిస్తున్నారని ఏడుస్తున్నారు. ఒక్కసారి పాత బస్తీకి వెళితే తెలుస్తుంది.